తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాత అన్నం కృష్ణ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. సినీ ప్రముఖుల వరస మరణ వార్తలతో టాలీవుడ్ లో విషాద వాతావరణం నెలకొంది. ఇటీవల సింగర్ జి ఆనంద్, సినిమాటోగ్రాఫర్ మోహన్జీ, గేయ రచయిత నంద్యల రవి, నటుడు టిఎన్ఆర్, ప్రో బిఎ రాజు కన్నుమూశారు.

వీరందరూ దూరం కావడంతో చిత్ర పరిశ్రమలో తీరని లోటు ఏర్పడింది. తాజాగా నిర్మాత అన్నం రెడ్డి కృష్ణకుమార్ కూడా కన్నుమూశారు. విశాఖ లో ఉంటున్న ఆయన బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చనిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

సాయి పల్లవి, ఫహద్ ఫాజిల్ జంటగా నటించిన సినిమా “అనుకోని అతిధి” ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఆహా OTT లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కృష్ణ కుమార్ మృతిచెందడంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మరోవైపు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు మరియు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

x