పుట్టినరోజు నాడే నర్సాపూర్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజును ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని తన ఇంటి నుండే సిఐడి అధికారులు ఎంపీ ను తరలించారు. సుమారు పది నుంచి ఇరవై మంది సిఐడి అధికారులు సివిల్ డ్రెస్స్‌తో వచ్చి ఆయనను అరెస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఎంపీ రఘు రామ కృష్ణం రాజుపై ఐపిసి 124 ఎ (రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిమినల్ కుట్ర), 153 బి, 505, 120 బి సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణం రాజు ఇంట్లో దాదాపు అర గంటకు పైగా హైడ్రామా నడిచింది. ఈ కరోనా టైంలో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసులతో చాలాసేపు రఘురామ కృష్ణంరాజు వాగ్వాదానికి దిగారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని నోటీసులు ఇవ్వకుండా ఎంపీ అయిన తనను ఎలా అరెస్టు చేస్తారని అయన ప్రశ్నించారు.

రఘురామ కృష్ణరాజు కు కేంద్రం అందించిన సిఆర్పిఎఫ్ భద్రత అధికారులు అరెస్టు సమయంలో ఎంపీ కి భద్రత కల్పించడానికి ప్రయత్నించింది. ఏదేమైనా, సిఆర్డిఎఫ్ ఉన్నతాధికారుల నుండి సిఐడి అధికారులకు తగిన అనుమతులు లభించాయి, దీని తరువాత సిఆర్పిఎఫ్ భద్రత సిఐడి అధికారుల విధి నిర్వహించడానికి మార్గం చూపారు.

వాగ్వాదం కొనసాగుతున్న తరుణంలోనే ఎంపీ ని బయటకు తీసుకువచ్చి వాహనంలోకి ఎక్కించారు సిఐడి పోలీసులు, ఆయన అభ్యంతరం చెబుతున్న వినలేదు. ఆ తర్వాత కొందరు పోలీసులు ఎంపీ ఇంటి గోడ పై నోటీసులు అంటించాడు. వారు చేసిన తీరున తీవ్రంగా తప్పుబట్టారు ఎంపీ కుమారుడు భరత్. ఎంపీ అని తెలిసి అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా తీసుకువెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిందని తెలిసి కూడా బలవంతంగా తీసుకు వెళ్లారని ఆయన చెప్పారు. ఆయన అరెస్టుపై AP CID అధికారుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

x