దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మరో పక్క మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. కరోనా వల్ల రోజుకి వెలది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్టాలల్లో వ్యాక్సిన్ కొరత వల్ల వాక్సినేషన్ ప్రక్రియ కూడా నిధానంగా ఉంది. ఈ వ్యాక్సిన్ కొరత వల్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మోడీకి లేఖరాశారు.

ఆయన లేఖలో ఇలా పేర్కొన్నాడు, ఏపీలో ప్రజల అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. అయితే వ్యాక్సిన్లు కొరతతో ప్రస్తుతం కేవలం 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు నేరుగా వ్యాక్సిన్ అందించడం వల్ల తప్పుడు సంకేతాలు వస్తున్నాయని అయన అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కు వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల వాటి ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయని ఈ లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. కొన్ని హాస్పిటల్స్ వ్యాక్సిన్ యొక్క ధరను రెండు వేల నుంచి 25 వేల వరకు అమ్ముతున్నారని దీని వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర వ్యతిరేకత కలుగుతుందని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాడు.

x