ప్రధాని మోడీ కి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ప్రైవేట్ హాస్పటల్స్ ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగటం లేదని ఆయన ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. జూన్ 21 నుంచి దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లో 25% కోతాను ప్రైవేట్ హాస్పటల్స్ కు కేటాయించండి కేంద్రం.

అయితే ప్రైవేట్ హాస్పటల్స్ లో వ్యాక్సినేషన్ కు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని జగన్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల 67 వేల 75 మంది మాత్రమే ప్రైవేట్ హాస్పటల్స్ లో వ్యాక్సిన్ వేయించుకున్నారు అని తెలిపారు.

త్వరగా అందరికీ వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున ప్రైవేట్ హాస్పటల్స్ లో మిగిలి ఉన్న డోసులను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీకి అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు కూడా ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వచ్చాయి.

x