కరోనా తో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు కరోనా నియంత్రణకు సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వంటి అన్ని అంశాలతో పాటు కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లలకు సంబంధించిన అంశం గురించి కూడా చర్చించారు.

ఈ మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలందరికీ సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ .10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తామని సిఎం జగన్ ఈ రోజు ప్రకటించారు. రేపటిలోగా దీనికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు చెప్పింది ఏపీ సర్కార్. పిల్లలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్థిరంగా ఉంటుందని మరియు ఆ 10 లక్షల పై వచ్చే నెల వడ్డీ తో పిల్లలంతా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చని అనుకుంటున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్న మరియు కోవిడ్ ప్రభావిత రోగులను ప్రభావితం చేసే వ్యాధి ‘బ్లాక్ ఫంగస్’ ను ఏపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే వ్యాధుల జాబితాలో చేర్చింది. అంతేకాకుండా సిఎం జగన్ రాష్ట్రంలో మహమ్మారి పరిస్థితిని సమీక్షించారు మరియు మే 31 వరకు రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ పొడిగింపును ప్రకటించారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.

x