ప్రతిపక్షం మరియు అన్ని వర్గాల నుండి భారీ ఒత్తిడికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఇంటర్ పరీక్షల పై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసింది.
కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ గారు ప్రకటించారు. హైకోర్టు చెప్పిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆదేశాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఆయన చెప్పారు. కోవిడ్ -19 తగ్గినా తర్వాత పరీక్షలను రీ షెడ్యూల్ చేస్తామని సురేష్ చెప్పారు. పరీక్షల కొత్త తేదీ, షెడ్యూల్ తరువాత ప్రకటిస్తామని సురేష్ తెలిపారు.
రాష్ట్రంలో మరియు దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని మంత్రి అంగీకరించారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణించి పరీక్షలను వాయిదా వేశారు.