ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లు ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే టిక్కెట్ల ధరల్ని విక్రయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా నియంత్రణ చట్టం 1955 ప్రకారం జారీచేసిన 1273 జీవోను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సినిమా హాళ్లలో వివిధ కేటగిరీల కింద టిక్కెట్ ధరలను గరిష్ఠంగా పెంచుకునే అంశంపై ప్రభుత్వం సవరణ ఇచ్చింది. ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హాళ్లలో టిక్కెట్ ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని పై గతంలో కూడా అనేక చర్చలు జరిగాయి.

ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమా టిక్కెట్లు విషయంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు టికెట్ ధర విషయంలో వెసులుబాటు కల్పించాలని జగన్ ను కోరినట్టు ప్రచారం ఉంది. అయితే తరువాత కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ విషయం సద్దుమణిగింది. కానీ, ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి షాక్ ఇస్తూ ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

x