వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ ధరలు పెంపు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. టికెట్ ధరలు పెంచ వద్దని ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. గత నెల 25న థియేటర్ల యాజమాన్యం వినతి పై టికెట్ల రేట్లు పెంచుటకు ఆదేశాలు ఇచ్చింది డివిజన్ బెంచ్. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేయగా ఆ తీర్పును ఇవాళ డివిజన్ బెంచ్ కొట్టేసింది.

మొదటి రెండు రోజులు మాత్రమే టికెట్లు పెంచే అవకాశం ఉందని ఆ తర్వాత నుంచి టికెట్ల ధరలు పెంచ వద్దని ఆదేశించింది హైకోర్టు. వకీల్ సాబ్ రిలీజ్ అయి రెండు రోజులు అయింది కనుక 11వ తేదీ నుంచి టికెట్స్ రేట్ తాగించాల్సిందే, ఇప్పటికే చాల మంది ప్రేక్షకులు 11వ తేదీ షో కి ఆన్లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. వారికీ మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదు, ఇప్పుడు నుంచి బుక్ చేసుకునే వారికీ మాత్రం మాములు రేట్లు ఉండనున్నాయి.

x