ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మరో కీలక నిర్ణయం తీసుకోండి. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టింది. ఏపీ రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉంటే 26 కొత్త జిల్లాల ఏర్పాటు చేసే దిశగా ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తుంది.
ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడే సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. 25 లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనుంది.
ఒక అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం రెండు జిల్లాలను ఏర్పాటు చేయనుంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రీత్యా చాలా విశాలమైనది. దీంతో ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు గా చేసే అవకాశం కనిపిస్తుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతనే కొత్త జిల్లాల ప్రతిపాదన చేచేసిందని ప్రభుత్వం చెప్తుంది. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.