తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ లో అత్యంత హైప్ మరియు అత్యధిక TRP రేటింగ్ ను సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ప్రారంభమైనప్పటి నుండి దీనికి ఉన్న ఆధరణ మరియు వీక్షకుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం బిగ్ బాస్ షో ఓ టి టి వర్షన్ కు సిద్ధమవుతోంది. కేవలం 10 వారాల ప్లే టైమ్ ఉన్న ఈ షో ను నాగార్జున హోస్ట్ చేయనున్నారు. ప్రేక్షకులు హాట్‌స్టార్ యాప్ ద్వారా పోటీదారులను పగలు మరియు రాత్రంతా (24X7) వీక్షించవచ్చు.

ఇప్పటికే ఈ షోకు సంబంధించి 15 మంది కంటెస్టెంట్స్ ను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో ఎక్కువ మంది యూట్యూబ్ మరియు టీవీ షో లకు చెందిన వారిగా తెలుస్తోంది. వారిలో కొందరు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారని మరియు క్వారంటైన్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

ఫిబ్రవరి నెల మధ్య నాటికి, అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ రియాలిటీ షో యొక్కకొత్త సెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొంతమంది యూట్యూబర్‌లు మరియు టీవీ యాంకర్లు వారి యాక్టివ్ ప్రోగ్రామ్స్ నుండి అదృశ్యమయ్యారు. దీనికి కారణం వారికీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.

x