DC vs KKR మ్యాచ్ హైలైట్స్ :
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మీద ఉన్న కోపాన్ని కోల్కతా నైట్రైడర్స్ మీద తీర్చుకుంది. గత మ్యాచ్లో ఒకే ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లో మొదటి నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించండి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా అద్భుతంగా ఆడటంతో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ పై విజయం సాధించింది.
మరోసారి కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘోర పరాజయాన్ని చూసింది. కోల్కత్తా ఓడిపోవడానికి మూడు విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి. మొదటిది ఓపెనర్ నితీష్ రానా వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. రెండవది టాప్ ఆర్డర్ బైట్స్మెన్స్ నిలకడలేని బ్యాటింగ్ కారణంగా చివర్లో రసూల్ అద్భుతంగా ఆడిన ఉపయోగం లేకుండా పోతుంది.
మూడవ కారణం ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా, శివమ్ మావి వేసిన మొదటి ఓవర్ లోనే ఏకంగా ఆరు బౌండరీలు కొట్టడంతో కోల్కత్తా పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. పృథ్వీ షా ఆడిన ఆ ఒక్క ఓవర్ ఢిల్లీ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడమే కాకుండా కోల్కత్తాను ఓటమి దిశగా పయనించేలా చేసింది.
KKR బ్యాట్టింగ్ హైలైట్స్ :
ఇక మ్యాచ్ హైలెట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి బంతి నుంచి ఢిల్లీ బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెన్త్ లో వేస్టు కోల్కతా బ్యాట్స్ మేన్స్ ను ముప్పతిప్పలు పెట్టారు. ఒక పక్క పరుగులు కట్టాడి చేస్తూనే మరో పక్క వరుసగా వికెట్లు పడకొట్టారు.
గిల్ మినహాయిస్తే మిగిలిన బ్యాట్స్ మేన్స్ ఎవరు కనీస పరుగులు సాధించలేదు. గిల్ మాత్రం 38 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివర్లో కోల్కత్తా ఆల్రౌండర్ ఆండ్రూ రసూల్ అద్భుతంగా ఆడకపోతే జట్టు స్కోర్ 100 కూడా దాటేది కాదు. రసూల్ 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఫలితంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్స్ లో లలిత్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు. అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
DC బ్యాట్టింగ్ హైలైట్స్ :
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మూడు వికెట్లు నష్టపోయి, లక్ష్యాన్ని సునాయాసంగా సాధించండి. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా మొదటి బంతి నుంచి కోల్కతా బౌలర్స్ పై విరుచుకుపడ్డాడు. మరో పక్క శిఖర్ ధావన్ మాత్రం ఆచితూచి ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన తర్వాత శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు.
పృథ్వీ షా అవుటైన తర్వాత కెప్టెన్ పంత్ కూడా కొద్ది సేపు దాటిగా ఆడి ప్రేవిలియన్ చేరాడు. అప్పటికే చేయాల్సిన రన్ రేట్ తగ్గిపోవడంతో మిగిలిన పనిని స్టోనిక్స్ మరియు హెత్మయర్ మరో 21 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను పూర్తి చేశారు. పృద్వి షా 41 బంతుల్లో 82 పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. శిఖర్ ధావన్ 47 బంతుల్లో 46 పరుగులు చేశాడు. కొలకత్తా బౌలర్లు లో కమిన్స్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు.