.ఫస్ట్ ఇన్నింగ్స్

.సెకండ్ ఇన్నింగ్స్

.SRH మ్యాచ్ ఓడిపోవడానికి గలా మూడు కారణాలు:

 

1. ఫస్ట్ ఇన్నింగ్స్:

SRH వర్సెస్ KKR మ్యాచ్ నిజంగా ఒక మంచి కిక్ ఇచ్చిందని చెప్పవచ్చు. నిన్న జరిగిన మ్యాచ్ లో SRH టాస్ గెలిచి ఫీల్డింగ్ను ఎంచుకుంది. మొదట బ్యాట్టింగ్ కు దిగిన KKR టీమ్ నిర్ణిత 20 ఓవర్లో 187 పరుగులు చేసింది. KKR బ్యాట్ మేన్స్ స్పిన్ కి బాగా అనుకూలించే పిచ్ పైన తనదైన స్టైల్ లో రెచ్చిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన KKR టీమ్ లో రానా మరియు రాహుల్ త్రిపాటి రెచ్చిపోయి మరీ షార్ట్స్ కొట్టారు. వాళ్ళ ఊపు ని చూస్తే ఒకానొక దశలో కచ్చితంగా టీమ్ స్కోర్ 200 దాటేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ టైమ్ లో నటరాజన్ రాహుల్ కి బ్రేక్ వేశాడు. అక్కడ మ్యాచ్ మలుపు తిరిగింది.

నితీష్ రానా ఈ రోజు జరిగిన మ్యాచ్లో అద్భుతంగా ఆడి 56 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇంకా రాహుల్ త్రిపాఠి కూడా ఈ రోజు అద్భుతంగా పెర్ఫామెన్స్ చేశాడు. రాహుల్ త్రిపాఠి 29 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇంకా లాస్ట్ లో వచ్చిన దినేష్ కార్తీక్ కేవలం 9 బంతుల్లో 22 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఈ 22 పరుగులే లాస్ట్ ఓవర్ లో హైదరాబాదుకు కావాల్సి వచ్చింది. ఇంకా మిగిలిన వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీనితో KKR టీమ్ నిర్ణిత 20 ఓవర్లో 187 పరుగులు చేసింది.

2. సెకండ్ ఇన్నింగ్స్:

187 పరుగుల భారీ స్కోర్ను ఛేదించటం కోసం SRH టీమ్ బరిలోకి దిగింది. మొదట దిగిన డేవిడ్ వార్నర్ మరియు సాహా తొందరగానే అవుట్ అయిపోయారు. భారీ స్కోర్ చేదించే విషయంలో ఓపెనర్లు ఇద్దరు తడబడి ప్రేవిలియన్ చేరారో అప్పుడే సగం మ్యాచ్ అయిపోయింది. కానీ జానీ బెయిర్‌స్టో మరియు మనీష్ పాండే ఇద్దరు కూడా వాళ్ల బ్యాటింగ్ తో ఒక మంచి ఉత్సాహాన్ని నింపారు.

జానీ బెయిర్‌స్టో కొట్టిన కొన్ని షాట్స్ నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. స్పిన్ కి బాగా అనుకులిస్తున్న పిచ్ పైన తనదైన స్టైల్ లో రెచ్చిపోయాడు. అంతా బాగున్నా టైమ్ లో జానీ బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు. కమ్మిన్స్ వేసిన 13 వ ఓవర్లో జానీ బెయిర్‌స్టో అవుట్ అయ్యాడు. జానీ బెయిర్‌స్టో 40 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఆ తర్వాత అబ్దుల్ సమద్ రావాల్సింది, కానీ ఎందుకో టీమ్ మేనేజ్మెంట్ నబి ని పంపారు. నబి అవుట్ అయినా తర్వాత కూడా సమద్ ను దింపకుండా విజయ్ శంకర్ ను దింపింది టీమ్ మేనేజ్మెంట్.

నబి మరియు విజయ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంకా లాస్ట్ లో దిగిన సమద్ కేవలం 8 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. ఇంకా మనీష్ పాండే 44 బంతుల్లో 61 పరుగులు చేశాడు. దీనితో SRH టీమ్ నిర్ణిత 20 ఓవర్లో 177 పరుగులు చేసి, 10 పరుగుల తేడా తో ఓడిపోయింది.

3. SRH మ్యాచ్ ఓడిపోవడానికి గలా మూడు కారణాలు:

ఇక మనం మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అది కచ్చితంగా 13వ ఓవర్ గురించే మాట్లాడుకోవాలి. కమింగ్స్ వేసిన ఈ ఓవర్లో బెయిర్‌స్టో వికెట్ పడిపోవడం అనేది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. అంతేకాదు ఆ ఓవర్లో పెద్దగా స్కోర్ కూడా రాలేదు. దీంతో ఒక్క ఓవర్ గేమ్ ని చేంజ్ చేసింది. స్పిన్నర్ కి అనుకూలించే పిచ్చి కాబట్టే మహమ్మద్ నబి ని జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. అందుకోసం కేన్ విలియమ్సన్ ను పక్కన పెట్టేశారు.

ఇంకో మిస్టేక్ ఏందంటే అబ్దుల్ సమద్ ను ముందుగా బ్యాటింగ్కు పంపకపోవడం అనేది ఒక పెద్ద మిస్టేక్. మహమ్మద్ నబి ప్లేస్ లోనే అబ్దుల్ సమద్ రావాల్సి ఉంది, కానీ ఎందుకో టీం మేనేజ్మెంట్ నబి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. మహ్మద్ నబి అవుట్ అయిన తర్వాత విజయ శంకర్ను బరిలోకి దింపారు. దీంతో సమద్ కి ఎక్కువ బంతులను ఎదుర్కొనే అవకాశం దొరకలేదు.

లాస్ట్ సీజన్ లో సమర్థ పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా కూడా సమద్ ముందుగానే వచ్చేస్తారని ఊహిస్తారు. అబ్దుల్ సమద్ కొంచెం ముందుగా వచ్చి ఉంటే మాత్రం కసిగా ఆడేవాడు, మ్యాచ్ మరో లాగా ఉండేది. ఇక ఆఫ్ సైడ్ లైన్ నమ్మి, ఒకే ఆఫ్ సైడ్ లెంట్ లో బాలింగ్ చేసిన రసూల్ బాగా క్లిక్ అయ్యాడు. లాస్ట్ లో వేసిన 2 ఓవర్లు ఏదైతే వేశాడో అవి కూడా మ్యాచ్ని నిర్దేశించాయి.

ఓవరాల్గా హైదరాబాద్ ఓడిపోవడానికి మూడు కారణాలు అని చెప్పుకోవచ్చు, అవి

1. ఓపెనర్లు ఫెయిల్ అవ్వడం

2. 13 ఓవర్లో బెయిర్‌స్టో అవుట్ అవ్వడం

3. ఇంక లాస్ట్ అబ్దుల్ సమద్ లేటుగా పంపడం. ఈ మూడు SRH విజయాన్ని దెబ్బ కొట్టాయి.

image source

x