నీటిలో డాన్స్ మీరు ఎప్పుడైనా చూశారా..? అసలు అది సాధ్యపడుతుందని అనుకున్నారా..? అవును అది సాధ్యమే అని నిరూపించింది స్పానిష్ డాన్సర్. స్పానిష్ డాన్సర్ 10 మీటర్ల లోతున అసలు ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా డాన్స్ చేసింది. ఓరా అనుకునేలా అందరిని అక్కట్టుకుంది. గతంలో ఎప్పుడు చూడని విధంగా స్పానిష్ డాన్సర్ “అరియాడ్నా హఫీజ్” అదరగొట్టింది. నీటి అడుగు భాగం లో మ్యూజిక్ కి తగినట్టుగా డాన్స్ చేసింది.

నీటిలో ఆక్సిజన్ లేకుండా ఉండటమే కష్టం, అలాంటిది ఈ స్పానిష్ డాన్సర్ 3 నిమిషాల వీడియో కోసం అద్భుత ప్రదర్శన చేసింది. మ్యూజిక్ కి తగినట్టుగా డాన్స్ తో ఆకట్టుకుంది. ఫ్రెంచ్ కి చెందిన బాస్టియన్ సోలైల్ ఈ వీడియోను షూట్ చేశారు. షూటింగ్ జరుగుతున్నా సందర్భంలో యూనిట్ అంతా చాలా సార్లు నీటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మొత్తానికి అదిరిపోయే కాస్ట్యూమ్స్, నీటి అడుగున చిన్నపాటి సెట్, అందులో డాన్స్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. బాస్టియన్ సోలెయిల్ ఈ వీడియోను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.

x