జబర్దస్త్ హాస్యనటుడు అవినాష్ ప్రస్తుతం స్టార్ మా లో ‘కామెడీ స్టార్స్’ అనే పోగ్రాంలో డిఫరెంట్ స్కిట్స్ వేస్టు అందర్నీ అలరిస్తూ ఉన్నాడు. బిగ్ బాస్ షో తర్వాత అవినాష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ షోలో అవినాష్ అరియానా తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ షో తర్వాత కూడా వీరిద్దరూ బయట చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. దీంతో అందరూ అవినాష్ అరియానా తో డేటింగ్ చేస్తున్నట్లు భావించారు.
కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ అవినాష్ తన నిశ్చితార్థం కు సంబంధించిన తన ఫియాన్సీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. మరో పక్క అరియానా బిగ్ బాస్ షో తర్వాత రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ తో ఆమె ఫుల్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె టీవీ షోలతో మరియు చిన్న బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా ఈ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేదు.
అయితే తాజాగా అవినాష్ పెళ్లిపై బిగ్‌బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ స్పందించింది. అవినాష్ నాకు మధ్య ఏదో ఉందని వచ్చిన పుకార్లు అబద్ధమని, అవినాష్ ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని, తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’..అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం నేను నా కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని, సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని అరియానా చెప్పుకొచ్చింది.