ప్రస్తుతం హీరో రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తో రామ్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ సినిమా కు విలన్ గా కోలీవుడ్ స్టార్ ను తీసుకోవాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ విలన్ పాత్ర కోసం కోలీవుడ్ నటుడు ఆర్య ను తీసుకుంటున్నట్లు సమాచారం.

ఆర్య తెలుగులో రాజా రాణి, వరుడు, సైజ్ జీరో వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్నారు. ఆర్య ఈ క్రమంలోనే రామ్ సరసన నెగెటివ్ రోల్ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

ఈ సినిమాలో ఆర్య సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

x