సుకుమార్ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా మరియు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన సినిమా ‘ఆర్య’. ఈ సినిమాలోని లవ్ స్టోరీ అప్పట్లో ట్రెండ్ సెట్ గా నిలిచింది. ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై 17 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా, అల్లు అర్జున్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.

“ఈ రోజు ఆర్య సినిమా రిలీజ్ అయ్యి 17 సంవత్సరాలు. ఇది నా జీవితంలో చాలా ఎక్కువ జీవితాన్ని మార్చే అనుభవం. ఇది ఎప్పటికి నా జీవితంలో గొప్ప అద్భుతం. “ఫీల్ మై లవ్” అంటూ నేను చెప్పిన తర్వాత ప్రేక్షకులు నా పై అభిమానం పెంచుకోవడం మొదలుపెట్టారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఈ చిత్రం చాలా మంది జీవితాలను మార్చివేసిందని అల్లు అర్జున్ గారు తెలిపారు. ఈ సినిమా నటుడిగా నా జీవితాన్ని, దర్శకుడిగా సుకుమార్ గారు జీవితాన్ని, నిర్మాతగా దిల్ రాజు గారి జీవితాన్ని, సంగీతకారుడిగా డిఎస్పి జీవితాన్ని, డిఓపిగా రత్నవేలు గారి జీవితాన్ని, డిస్ట్రిబ్యూటర్ గా బన్నీ వాసు జీవితాన్న ఇలా మరెన్నో జీవితాలను ఈ సినిమా మార్చింది. అందరి జీవితాల్లో ఆర్య సినిమా గొప్ప మైలురాయిగా ఎప్పటికి నిలుస్తుందని” చెప్పాడు.

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బన్నీ, డీఎస్పీలతో కలిసి ట్వీట్ చేస్తూ, “నిజమే! అల్లు అర్జున్ ఇది నిజంగా జీవితాన్ని మార్చిన చిత్రం, ఈ సినిమా మనందరినీ తదుపరి స్థాయికి తీసుకువచ్చింది! చాలా కృతజ్ఞతలు. ” అంటూ రత్నవేలు గారు ట్విట్ చేశారు.

x