దేశంలో కరోనా రెండొవ దశ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్రం హెచ్చరిస్తోంది. మరో పక్క థర్డ్ వేవ్ ముప్పు తప్పదనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలోనే కేరళలో ఎక్కువ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తుంది.

ప్రస్తుతం కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. ప్రస్తుతం మిగతా రాష్ట్రాల్లో రోజువారి కేసుల సంఖ్య వందల్లో ఉంటె, కేరళలో మాత్రం రోజువారి కేసులు 10 వేలకు పైగా నమోదవుతున్నాయి. కేరళలో కరోనా పరిస్థితి చేయి దాటి పోయినట్లు కనిపిస్తోంది. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గింది. కానీ, కేరళలో మాత్రం ఇంకా 10 శాతం పైగా పాజిటివ్ రేటు ఉండటం ఆందోళన కలిగిస్తుంది.

ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారి కేసుల్లో 40 శాతం ఒక్క కేరళలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 22వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఇతర రాష్ట్రాల తో పోలిస్తే కేరళ ప్రభుత్వం వేగంగా అందిస్తుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉంటె, కేరళలో మాత్రం గడిచిన ఆరు వారాల్లో పాజిటివ్ రేటు 10 నుంచి 12 శాతం గా ఉంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతుండటంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమేనని కేరళ ప్రభుత్వం అంగీకరించింది. ఏప్రిల్ మధ్యకాలంలో రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రారంభమైంది. మే 12న అత్యధికంగా 43 వేల కేసులతో గరిష్టానికి చేరుకుంది. అనంతరం తగ్గుతుందని భావించినప్పటికీ వైరస్ తీవ్రత ఇంకా కొనసాగుతుంది. అయితే, వైరస్ తగ్గుదలకు కృషి చేస్తున్నామని కేరళ ప్రభుత్వం చెబుతుంది.

x