కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ కరోనా అన్ని రంగాలను వణికిస్తోంది. ఈ కరోనా వల్ల ఐపీల్ కూడా నిలిపివేయబడింది. ఐపీఎల్ నిలిపివేయడానికి ముందే అశ్విన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను చూసి అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. బయో బబుల్ వాతావరణంలో నిర్వహించిన ఐపీల్ కు కరోనా బ్రేకులు వేసింది.

అశ్విని కుటుంబ సభ్యులకు కరోనా రావడం తో ఫ్యామిలీ కోసం తాను ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఐపీల్ నిర్వాహకులు ఐపీల్ ను నిలిపివేయడానికి ముందే అశ్విన్ ఈ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. కుటుంబ సభ్యులకు అవసరమైన జాగ్రత్తలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. వారికి కావాల్సిన ధైర్యాన్ని నింపుతున్నాడు. అశ్విన్ కుటుంబ సభ్యులు ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నారు.

అయితే దేశ వ్యాప్తంగా కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితిని చూసి చలించిపోయాడు. వైద్యుల నిస్సహాయ స్థితి తనను కాల్చివేస్తుందని వాపోయాడు. దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఒక పక్క హాస్పిటల్స్ లో పడకలు లేవు, ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది వైద్యుల కళ్ళముందే ప్రాణాలు విడుస్తున్నారు.

దీనితో వైద్యులు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, వైద్యుల ముఖాలలో నిస్సహాయ స్థితి కనిపిస్తుందని అయన చెప్పారు. ఢిల్లీలోని ఒక హాస్పటల్లో ఆక్సిజన్ అందాకా రోగుల మృతిచెందిన ఘటన పై అక్కడ వైద్యులు ఏమి మాట్లాడ లేక ఆవేదనతో కంటతడి పెట్టుకున్న దృశ్యాలు చూసిన వెంటనే అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

x