అసెంబ్లీ ముందు ఓయూ లా విద్యార్థులు, జేఏసి నిరసనకు దిగింది. వామనరావు, నాగమణి న్యాయవాది దంపతుల హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఆందోళన చేపట్టారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు, బీసీలకు వంద కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.

OU students, JAC, ABVP dharna at Assembly

అంతే కాకుండా “సీఎం డౌన్…! డౌన్…! సీఎం డౌన్…! డౌన్…!” అనే నినాదాలతో అసెంబ్లీ పరిసరాలలో ఓయూ యూనివర్సిటీ విద్యార్థులు హోరెత్తారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసారు.

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను భర్తీ చేయాలంటూ కూకట్ పల్లి JNTUH ఎదుట ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు.

రాష్ట్రంలో ఉన్న 11 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా కెసిఆర్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మంది పడ్డారు.

ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు ఏబీవీపీ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. అర్ధ నగ్న ప్రదర్శనతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

x