తమిళనాడులో ఒక దారుణం చోటుచేసుకుంది. ఓ అనాధాశ్రమం లో 16 మంది పిల్లలు మాయమయ్యారు. పిల్లలు కరోనాతో చనిపోయారని నాటకమాడిన ట్రస్ట్ నిర్వాహకులు. తమిళనాడులోని మధురై జిల్లా మేలూరు లోని ఇదయం ట్రస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వారం క్రితం ట్రస్ట్ నిర్వాహకులు మాణిక్కం అనే బాలుడిని 5 లక్షలకు అమ్మారు.

ఈ విషయం తెలియక ఆ బాలుడు తల్లి బాబును చూడటానికి రావడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. కరోనాతో మీ బాలుడు చనిపోయాడని ట్రస్టు నిర్వాహకులు చెప్పారు. ఆ నిర్వాహకులుపై అనుమానం వచ్చి బాలుడు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి నుంచి ఇప్పటి వరకు సుమారు 60 మందికి పైగా పిల్లలు అదృశ్యమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ట్రస్ట్ నిర్వాహకులు శివ కుమార్, మదర్షా పరారీలో ఉన్నారు. ఈ ట్రస్ట్ వెనుక భారీ రాకెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు ఈ కేసులో చిన్నారులను కొనుగోలు చేసిన సక్కుబాయ్‌, సాదిక్‌, కన్నన్‌, భవానీ దంపతులను అరెస్ట్ చేశారు మరియు పిల్లలను వారి దగ్గర నుంచి రక్షించారు. ప్రస్తుతం పోలీసులు ఆశ్రమంలో ఉన్న వారిని వేర్వేరు అనాథాశ్రమాలకు తరలించారు. ప్రస్తుతం ట్రస్ట్ నిర్వాహకులు కోసం గాలింపు చర్యలను చేపట్టారు.

x