కరోనా వల్ల ఎక్కడ చూసినా ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మంచి మనసుతో ముందుకు వస్తున్నారు కొంతమంది ఈ కోవలోనే మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ ఆటో డ్రైవర్ సాయం చేయాలంటే భారీగా ఆస్తులు ఉండనవసరం లేదు, కరోనా బాధితులకు సాయం చేయించాలంటే గొప్పవాళ్ళ అవసరం లేదు, ఊపిరి పోయాలని సంకల్పం ఉంటే చాలు అని అంటున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఈ ఆటో తన భార్య నగలు అమ్మి తన ఆటో ను అంబులెన్స్ గా మార్చి కరోనా రోగులకు సాయం చేస్తున్నాడు.
కరోనా భయంతో ఇళ్ల నుంచి అసలు ఎవరు బయటకు రాని ఈ టైమ్ లో
బోపాల్ కు చెందిన జావీద్ ఖాన్ అనే ఆటో డ్రైవర్ కరోనా బాధితులకు తానున్నానని భరోసా ఇచ్చాడు. చెప్పడమే కాదు, ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టైంకి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వారిని సామాజిక మాధ్యమాలలో చూసి చలించిపోయాడు.
తనవంతుగా ఏదైనా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న వెంటనే తన ఆటో నే అంబులెన్స్ గా మార్చారడు. ఆక్సిజన్, శానిటైజర్ ఔషధాలను ఆటో లో పెట్టాడు. గంటల పాటు క్యూలో ఉంది సుమారు 400 వెచ్చించి స్థానిక పరిశ్రమల్లో ఆక్సిజన్ సిలిండర్ నింపిస్తున్నాడు.
ఫోన్ చేసిన వారి వద్దకు వెళ్లి వారిని ఉచితంగా హాస్పిటల్కి తరలిస్తున్నాడు, గత 20 రోజుల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న తొమ్మిది మందిని హాస్పిటల్ కి తరలించాడు . ఆటో నడిపితేనే పూట గడవని స్థితిలో ఉన్న జావీద్ ఈ ఏర్పాట్లు ఎలా చేశారని స్థానికులు ఆరా తీశారు. అసలు విషయం తెలిసి మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. ఇంతకీ ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు ఏం చేశారో తెలుసా. తన భార్య నగలు అమ్మి ఈ సౌకర్యాలను ఏర్పాటు చేసాడు.
వైరస్ సోకి బాధపడుతున్న వారికి ఉచితంగా అత్యవసర సేవలు అందించి ఆస్పత్రికి తరలించేందుకు ఈ ఆటోను ఆంబులెన్స్ గా సిద్ధం చేశాడు. ఏదేమైనా కరోనా భయంతో కుటుంబ సభ్యులే దగ్గరికి రాని ప్రస్తుత పరిస్థితిలలో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు జావిద్ చేస్తున్న కృషికి స్థానికులు అభినందిస్తున్నారు.