మల్టీ టాలెంట్ తో అవసరాల శ్రీనివాస్ కి టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. నటుడుగా, దర్శకుడుగా, రచయితగా ఇలా భిన్న కోణాల్లో రాణిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా తో కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత డైరెక్టర్ గా, రైటర్ గా తన టాలెంట్ చూపించి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నాడు.
అవసరాల శ్రీనివాస్ ఇప్పటివరకు చాలా సినిమాలో యాక్ట్ చేశాడు. పైకి చాలా సాఫ్ట్ గా కనిపించే అవసరాల శ్రీనివాస్ బయటకు మాత్రం చాలా రఫ్ గా ఉంటారని ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే ఒక అసిస్టెంట్ ను అవసరాల శ్రీనివాస్ ఇబ్బంది పెట్టాడు.
దీనితో ఆ అసిస్టెంట్ కు కోపం వచ్చి, అవసరాల శ్రీనివాస్ షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు ఒక వీడియో తీసి సోషల్ మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. ఆ అసిస్టెంట్ తీసిన వీడియోలో అవసరాల శ్రీనివాస్ యొక్క అసలు రూపం కనపడింది. షూటింగ్ స్పాట్ లో అవసరాల శ్రీనివాస్ ఉండగా ఆ అసిస్టెంట్ వీడియోను తీశాడు.
ఈ వీడియో బయటకు వస్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని ఆ అసిస్టెంట్ ను అవసరాల శ్రీనివాస్ బెదిరించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వెండితెరపై ఉంగరాల జుట్టు తో కనిపించే అవసరాల శ్రీనివాస్ ని చూసి అమ్మాయిలు బాగా ఇష్టపడేవారు. చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ ఉండని కుళ్ళు కొనేవారు కూడా ఉన్నారు. కానీ అవసరాల శ్రీనివాస్ విగ్ మెయింటెన్ చేస్తారని తెలియడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. రంగుల ప్రపంచం అంటే అంతా మాయే.