ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో భారీ కలెక్షన్స్ ను రాబడుతున్నది. తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డు ను అందుకుంది.

SS రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు ఆడింది. ఆ మూవీ తరువాత సినిమా రన్ టైమ్ యొక్క ట్రెండ్ ను ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 103 సెంటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంది .

ఈ సినిమా విడుదలైన 5, 6 వారాల తర్వాత కూడా, వీకెండ్ లో మరియు పండుగ సెలవల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్ల తో ముందుకు సాగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాకు సంక్రాంతి వారంలో కొత్త థియేటర్లను జోడించారు. అంతేకాదు, బాలకృష్ణ కెరీర్ లో 150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన సినిమా కూడా ఇదే. నాన్ థియేట్రికల్ బిజినెస్‌తో కలిపి, ఈ సినిమా మొత్తం బిజినెస్ 200 కోట్లకు చేరుకుంది.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా విడుదల విషయం లో మరియు దాని ప్రమోషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది సినిమాకి పెద్ద ఎత్తున సహాయపడింది.

x