నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కలియకలో వచ్చిన సింహా మరియు లెజెండ్ సినిమాలు రెండు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు మల్లి వీరి కలియికలో ఇంకో సినిమా రానుంది. ఈ సినిమాకు తాత్కాలికంగా # బిబి 3 పేరుతో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇదిలావుండగా, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 న టైటిల్ వెల్లడిస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు. చాలా వరకు అందరు, ఈ చిత్రానికి, బోయపతి ‘గాడ్‌ఫాదర్’ అనే టైటిల్‌ను ఎంచుకున్నారని అంటున్నారు.
ఇంతకుముందు, ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్‌ను భావించిందని ఊహాగానాలు వచ్చాయి కాని, ఫిల్మ్ యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ‘గాడ్‌ఫాదర్’ ను ఇష్టపడినట్లు కనిపిస్తోంది. బాలయ్య కూడా ఆ టైటిల్ కు అనుమతి ఇచ్చారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సంగతి తెలియాలి అంతే ఏప్రిల్ 13 వరకు ఆగాల్సిందే, ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం 12:33 గంటలకు మేకర్స్ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఫిల్మ్ యూనిట్ టీజర్‌ను చాలా రోజుల క్రితం విడుదల చేసింది. అభిమానుల నుంచి ఆ టీజర్ కు ప్రత్యేక ఆధరణ వచ్చింది.
ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాలా రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ ప్రధాన కథానాయికగా బాలయ్యతో జత కట్టింది. ఈ చిత్రం మే 28 న విడుదల కానుంది.