ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. ఈ వైరస్ వల్ల కొందరు కోలుకుంటే మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ 104 సంవత్సరాలు ఉన్న బామ్మ ,మరియు 70 ఏళ్లు దాటిన తన కుటుంబ సభ్యులు కరోనాను సైతం జయించారు. మనో ధైర్యమే కరోనా పై విజయం సాధించడానికి అసలైన ముందు అని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా కేంద్రంలోని సావర్కర్ నగర్ కు చెందిన 104 సంవత్సరాల వయస్సు ఉన్న కందాల రంగనాయకమ్మ మరియు 70 సంవత్సరాలు దాటిన ఆమె కుటుంబ సభ్యులు కంటికి కనిపించని శత్రువుతో పోరాడి చేయించారు. కరోనాను జయించడానికి డాక్టర్ సలహాలను పాటించడంతో పాటు మంచి పోషక ఆహారం తీసుకున్నామని వారు చెప్పారు.

కందాల రంగనాయకమ్మ మాట్లాడుతూ, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం ఇవే తమకు ఔషధంగా పని చేశాయని చెప్పింది. కరోనా సోకిందని భయపడితే అది మరింత కుంగదీస్తోంది అని ఆమె చెప్పారు. ఎదుటి వారికి వైరస్ సోకకుండా ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ ను తరిమికొట్టాలని ఆమె చెబుతుంది. రంగనాయకమ్మ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సినేషన్ కూడా తీసుకున్నారు.

x