ఏప్రిల్లో మీకు బ్యాంకు కి సంబంధించి ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నాయా, అయితే ఈ న్యూస్ మీకోసమే ఏప్రిల్ లో మొత్తం 12 రోజులు బ్యాంకు హాలిడేస్ ఉన్నాయి. అంటే ఏప్రిల్ నెలలో బ్యాంకులు పని చేసేవి కేవలం 18 రోజులు మాత్రమే. అంతేకాకుండా మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య పది రోజుల బ్యాంకులకు ఏడు రోజులు సెలవులు ఉన్నాయి.

ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే కాదు, ప్రైవేట్ బ్యాంకులకు కూడా సెలవులు వర్తిస్తాయి. కాబట్టి మీ లావాదేవీలు ప్లాన్ చేసుకునే ముందు ఏ ఏ రోజులు సెలవులు ఉంటాయి అని తెలుసుకోవడం చాలా అవసరం. ఏప్రిల్ లో పండుగలు మరియు ఇతర సెలవులు ఎక్కువగా వచ్చాయి. దీంతో బ్యాంకులు ఎక్కువ రోజులు క్లోజ్ గా ఉంటాయి.

గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామనవమి తో పాటు బాబు జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి ఉన్నాయి. వీటితో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. ఇవన్నీ కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులు మూసేసి ఉంటాయి. మరి ఏ రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉన్నాయి చూద్దాం.

1. ఏప్రిల్ 1న బ్యాంకుల అకౌంటింగ్.
2. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే.
3. ఏప్రిల్ 4 వ తారీకు ఆదివారం.
4. ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్ రామ్ జయంతి.
5. ఏప్రిల్ 10న రెండవ శనివారం.
6. ఏప్రిల్ 11న ఆదివారం.
7. ఏప్రిల్ 13న ఉగాది.
8. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి.
9. ఏప్రిల్ 18న ఆదివారం.
10. ఏప్రిల్ 21న శ్రీరామనవమి.
11. ఏప్రిల్ 24న నాలుగవ శనివారం.
12. ఏప్రిల్ 25న ఆదివారం.

ఈ బ్యాంకు సెలవులు అన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకు సెలవులు వివరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.

 

x