రంగస్థలం మూవీ సెట్స్ నిర్మించిన అదే ప్రదేశంలో, బెల్లంకొండ శ్రీనివాస్ యొక్క చత్రపతి రీమేక్ సినిమా కోసం గ్రామానికి సంబందించిన సెట్స్ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు పర్యవేక్షణలో నిర్మించబడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ మరియు తరువాత వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఆలస్యం అయింది. ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

హైదరాబాద్‌లో 6 ఎకరాల భూమిలో ఒక గ్రామానికి సంబందించిన సెట్స్ నిర్మించడం కోసం మేకర్స్ రూ .3 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, భారీ వర్షాల కారణంగా ఏర్పాటు చేసిన సెట్స్ దెబ్బతిన్నాయి. సెట్స్‌ కోసం చాలా డబ్బు ఖర్చు చేయడంతో మేకర్స్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.

x