యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మధ్య ఎక్కువగా రీమెక్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. అతని మొదటి హిట్ ‘రాక్షసుడు’ సినిమా కూడా ఒక తమిళ సినిమా రీమెక్, ప్రసుతం బెల్లంకొండ శ్రీనివాస్, ప్రభాస్ చేసిన ‘చత్రపతి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పుడు బెల్లాంకొండ మరో రీమేక్ సినిమాను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ధనుష్ ఇటీవలే తీసిన ‘కర్ణన్’ సినిమా థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా కొల్లగొట్టింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ ‘కర్ణన్’ తెలుగు రీమేక్ హక్కులను తగిన మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఒకవేళ అది నిజం అయితే, బెల్లంకొండ సురేష్ తన కొడుకుతో కర్ణన్ రీమేక్‌ను తెరకెక్కించే అవకాశం ఉంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా సినిమా, 90’s మధ్యలో తమిళనాడులో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

x