ప్రస్తుతం బీమ్లా నాయక్ నిర్మాతలు పవర్ స్టార్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. చిత్రబృందం ఈమధ్యే సినిమాకు సంబంధించి మొదటి గ్లింప్స్ వీడియోను విడుదల చేయగా.. తాజాగా మూవీ మేకర్స్ “భీమ్లా నాయక్ ఇన్ బ్రేక్ టైమ్” అంటూ మరొక వీడియోను విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన వీడియో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గన్ చేపట్టి షూట్ చేస్తూ కనిపించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కు చిన్న విరామం దొరకడంతో ఇలా గన్ చేపట్టి షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం నెటిజన్స్ ఈ వీడియోపై లైకుల వర్షాన్ని కురిపిస్తున్నారు. చిత్రబృందం సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.