సాగర్ కే చంద్ర దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనం కొషియం సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియో మరియు ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై అంచనాలను విపరీతంగా పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా సినిమాలోని ఫస్ట్ సింగిల్ పై మూవీ మేకర్స్ ఒక అధికారిక ప్రకటన చేశారు.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా భీమ్లా నాయక్ చిత్రం నుండి టైటిల్ సాంగ్ ను సెప్టెంబర్ 2 వ తేదీన ఉదయం 11:16 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ నటిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ గా పనిచేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

x