ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రాలల్లో ఖుషి సినిమా ఒకటి. ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచి పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ లో పెద్ద స్టార్ గా మార్చింది. ఈ సినిమా పాటలు కూడా అప్పట్లో హాల్ చల్ చేశాయి. ఇప్పటికి ఈ సినిమా పాటలను ఇష్ట పాడనీ వారు ఎవరు ఉండరు. ఈ రోజు, ఖుషి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తియింది. ఈ సందర్భంగా హీరోయిన్ భూమికా చావ్లా ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

“ఖుషి సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజు కి 20 సవంత్సరాలు. ఈ సినిమా ద్వారానే నేను ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్కువగా పొందాను. దర్శకుడు ఎస్.జె.సూర్య , పవన్‌ కళ్యాణ్ గారు, నిర్మాత ఎ.ఎం.రత్నం సర్, మణి శర్మ గారు, మరియు మీ అందరికీ ధన్యవాదాలు ”అని భూమికా ఈ రోజు ముందు ట్వీట్ చేసింది.

ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఖుషి సినిమాలో శివాజీ, అలీ మరియు విజయ్ కుమార్ ఇతర ప్రముఖ పాత్రలలో నటించారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పవర్ స్టార్ అభిమానులందరూ #20YearsForClassickushi హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు.

x