కర్నూలు జిల్లా : ఉదయం పొలానికి వెళ్లిన రైతు మధ్యాహ్నానికి కోటీశ్వరుడు అయ్యారు. పొలానికి వెళ్లిన రైతు పొలంలో పనిచేస్తుండగా అతనికి ఒక విలువైన వజ్రం దొరికింది. ఆ వజ్రం తన కష్టాలన్నిటిని ఒక్కసారిగా తీర్చేసింది. వివరాల్లోకి వస్తే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లో అత్యంత విలువైన వజ్రాలు కూలీలకు దొరుకుతున్నాయి. ఈ వజ్రాలు జొన్నగిరి, పగిడిరాయి, జి ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్న జొన్నగిరి లో ఒక రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలంలో పని చేస్తున్న ఆ రైతుకు వజ్రం దొరకగా రహస్యంగా టెండర్ వేశారు. ఆ వజ్రాన్ని కోటి 25 లక్షలకు ఓ వజ్రాల వ్యాపారి దాన్ని సొంతం చేసుకున్నారు. వ్యాపారులు అంచనా ప్రకారం ఆ వజ్రం మార్కెట్లో 3 కోట్లకు పైగా విలువ చేస్తుందని చెబుతున్నారు.

x