దివంగత ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసారా చిత్రం ను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. మొదట్లో ఈ సినిమాను ఒక్క భాగం లో తెరకెక్కించాలని ఆలోచించినప్పటికీ, ప్రస్తుతం ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

బింబిసారా యొక్క కథ చాలా పెద్దదిగా మరియు ఆసక్తి గా ఉన్నందున ఈ సినిమాని మూడు భాగాలుగా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే, ప్రతి భాగానికి మధ్య కొంత గ్యాప్ ఉంటుందని వారు చెబుతున్నారు. మొదటి భాగం విడుదల అయిన తరువాత దర్శకుడు మరియు కళ్యాణ్ రామ్ రెండొవ భాగం కోసం జత కట్టే ముందు కొన్ని రెగ్యులర్ సినిమాలు చేస్తారని అర్థమవుతుంది.

ఈ సినిమాలో మొదటి భాగం 40 కోట్ల తో తెరకెక్కనున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ కు ఇది పెద్ద బడ్జెట్ సినిమా. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క రెండవ భాగం మరియు మూడవ భాగం లో ఆసక్తికరమైన తారాగణాన్ని తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. మొదటి భాగం షూట్ 80 శాతం పూర్తయింది.

x