ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ ని గూగుల్ పాలిస్తుంటే ఆ గూగుల్ నే పాలిస్తున్నాడు అతడు, మనదేశంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించే స్థాయికి చేరుకున్నాడు. ఒకప్పుడు బ్యాగ్ కూడా కోనుక్కోవడానికి డబ్బులు లేని స్థాయి నుంచి ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వందల కోట్ల జీతం అందుకుంటూ, ప్రపంచంలో లో ఎక్కువ శాలరీ అందుకుంటున్న వారిలో ఒకరుగా నిలిచారు. ఆయనే సుందర్ పిచాయ్.

గూగుల్ కంపెనీలో చిన్న జాబ్ వచ్చిన చాలు అని కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ఆయన గూగుల్ కె సీఈవో అయ్యారు. అలాంటి సుందర్ పిచాయ్ జీవితం గురించి చిన్న స్థాయి నుంచి అంతా పెద్ద స్థానానికి ఎలా ఎదిగారు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సుందర్ పిచాయ్ బాల్యం:

Sundar pichai with his Father & Mother

సుందర్ పిచాయ్ జూలై 12, 1972 న తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి రఘునాథ పిచాయ్, కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేసేవారు. వాళ్ళ అమ్మగారు స్టెనోగ్రాఫర్ గా పని చేసేవారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. చిన్నప్పటి నుంచే సుందర్ చదువులో లో చదువులో ముందు ఉండేవాడు.

Sundar pichai Childhood pics

సుందర్ పిచాయ్ కి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. వాళ్ళ ఇంట్లో ఒక రోటరీ డయల్ టెలిఫోన్ ఉండేది, ఇతను ఏదైనా ఒక ఫోన్ నెంబర్ కి ఒకసారి కాల్ చేస్తే చాలు ఆ నంబర్ గుర్తుండిపోయేది. సుందర్ పిచాయ్ చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడు. తనకి క్రికెటర్ అవ్వాలని కోరిక ఉండేది.

సుందర్ పిచాయ్ విద్య:

జవహర్ విద్యాలయంలో పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత వాన వాణి కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియాలోనే ప్రముఖమైన ఐఐటి ఖరగ్పూర్ లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందాడు.

కాలేజీలో చదువుతున్నప్పుడు అంజలి అనే అమ్మాయిని ప్రేమించారు. ఆ తర్వాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఎం ఎస్ చేయడానికి స్కాలర్షిప్ గెలుచుకున్నాడు. కాకపోతే అమెరికా వెళ్లడానికి కావాల్సిన డబ్బు లేదు. వాళ్ళ నాన్నగారు అప్పటివరకు దాచిన కొద్ది డబ్బు తో పాటుగా మరికొంత డబ్బును అప్పుగా తెచ్చి సుందర్ పిచాయ్ అమెరికాకి పంపాడు.

అమెరికాకు వెళ్లిన తర్వాత ఒక బ్యాగు కొనుక్కుందామని ఎంత అని అడగగా $60 అని చెప్పే సరికి తాను ఉన్న పరిస్థితికి అది అవసరంలేదు అని అనుకున్నారట. అప్పుడు ఆయనకు అమెరికాలో వస్తువుల ధరలు ఎంత ఎక్కువగా ఉంటాయో తెలిసింది. డబ్బులు సరిపోయేవి కావు,

అప్పట్లో ఇంటర్నేషనల్ కాల్ చార్జెస్ ఎక్కువగా ఉండటంతో తాను ప్రేమించిన అమ్మాయి తో చాలా కాలం పాటు మాట్లాడటం కూడా కుదిరేది కాదు. అలా సుందర్ పిచాయ్ మెటీరియల్ సైన్స్ మరియు సెమీ కండక్టర్ ఫిజిక్స్ లో ఎం ఎస్ పూర్తి చేశారు.

సుందర్ పిచాయ్ తన చదువు, వాళ్ళ నాన్న గారికి భారం కాకూడదు అని అనుకున్నాడు. దాదాపు ఆయన చదువు అంత కూడా స్కాలర్షిప్ ద్వారానే పూర్తిచేశారు. ఆ తర్వాత అప్లైడ్ మెటీరియల్స్ అనే కంపెనీ లో చేరాడు.

కొంతకాలానికి అది కూడా మానేసి,పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ లో ఎంబీఏ పూర్తి చేశారు. అది అయిన తరువాత మెకిన్స్ అండ్ కంపెనీ లో లో జాబ్ లో చేరాడు. జాబ్ లో చేరిన తర్వాత ఇండియాకు వచ్చి వాళ్ళ ప్రేమ విషయం ఇంట్లో చెప్పారు. ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఒప్పుకోవడంతో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు.

Sundar Pichai Marriage, Wife

గూగుల్ లో సుందర్ పిచాయ్ ప్రయాణం:

Sundar Pichai Google CEO

అప్పట్లో ఇంటర్నెట్ ఊపు అందుకుంటుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకొస్తుందని అనిపించింది. తాను కూడా ఆ మార్పు లో భాగం అవ్వాలి అనుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి గూగుల్ లో జాబ్ కోసం ఇంటర్వ్యూకి హాజరయ్యారు.

సరిగ్గా అది 2004 ఏప్రిల్ 1 అదే రోజు గూగుల్ కంపెనీ జీమెయిల్ స్టార్ట్ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో సుందర్ పిచాయ్ ని జీమెయిల్ గురించి తెలుసా అని అడిగారు. కానీ సుందర్ పిచాయ్ జీమెయిల్ గురించి అసలు అప్పటివరకు ఏమి వినలేదు. అది ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకున్నాడు.

తనకు జీమెయిల్ గురించి ఏమీ తెలియదని చెప్పాడు తర్వాత ఇంటర్వ్యూ చేసే వ్యక్తి జీమెయిల్ ని కొంతసేపు చూపించి, అప్పుడు జీమెయిల్ మీద తన అభిప్రాయాన్ని, దానిని ఇంకా ఎలా అభివృద్ధి చేయవచ్చని సుందర్ పిచాయ్ వివరిస్తారు.

బహుశా ఆ ఇంటర్వ్యూ చేసేవారు కూడా ఊహించి ఉండరు వాళ్లు ఆ కంపెనీకి కాబోయే సీఈఓ ని ఇంటర్వ్యూ చేస్తున్నామని, ఆ విధంగా 2004లో గూగుల్ సెర్చ్ టూల్ బార్ పై పనిచేసే ఒక చిన్న టీంలో చేరారు. అలా మెటలర్జీ చదివిన సుందర్ పిచాయ్ టెక్నాలజీ రంగం వైపు అడుగులు వేశారు. ఇక అక్కడినుంచి వెనుతిరిగి చూడలేదు.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆవిర్భావం:

Google Chrome

అప్పట్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా వంటి బ్రౌజర్ లను కూడా వాడేవారు. వాటి కాంపిటేషన్ తట్టుకోవాలంటే గూగుల్ కి కూడా ఒక ప్రత్యేకమైన బ్రౌజర్ ఉండాలని సుందర్ పిచాయ్ కి ఆలోచన వచ్చింది.

ఇదే ఐడియా తన సీనియర్లకు చెబితే వాళ్లు వద్దన్నారు. అప్పటి గూగుల్ సీఈఓ అయిన ఎరిక్ కి చెబితే అది చాలా ఖర్చుతో కూడుకున్నదని, అయ్యే పని కాదు అన్నారు. పట్టు వదలకుండా చివరికి గూగుల్ ఫౌండర్స్ అయినా లారీ పేజ్, సెర్జీ బ్రిన్ కి కూడా చెప్పి ఎంతో కష్టపడి ఒప్పిస్తాడు.

అలా గూగుల్ కి సపరేట్ బ్రౌజర్నని డెవలప్ చేస్తారు. అదే ఇప్పుడు మనం అందరం వాడుతున్న గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ ఎంత హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. గూగుల్ క్రోమ్ దెబ్బకు అప్పటివరకు ఉన్న మిగిలిన బ్రౌజర్లు అన్ని కనుమరుగైపోయాయి.

ఇప్పుడు గూగుల్ ఇంత సక్సెస్ అవ్వడానికి గూగుల్ క్రోమ్ కారణమైతే, గూగుల్ క్రోమ్ సక్సెస్ అవ్వడానికి సుందర్ పిచాయ్ కారణం. వెంటనే గూగుల్ సుందర్ పిచాయ్ ని ప్రోడక్ట్ డెవలప్మెంట్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసింది. దానితో గూగుల్ కి సంబంధించిన ప్రెజెంటేషన్ లో సుందర్ పిచాయ్ ఎక్కువగా కనపడుతూ ఉండేవారు.

గూగుల్ సీఈఓ గా సుందర్ పిచాయ్ ఎంపిక:

Sundar Pichai as Google CEO

గూగుల్ డ్రైవ్, క్రోమ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) ఇలా కొత్త కొత్త ప్రొడక్ట్స్నని మార్కెట్లోకి తీసుకురావడంలో సుందర్ పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ని డెవలప్ చేసిన ఆండ్రూ ఇ. రూబిన్ వేరే డిపార్ట్మెంట్ కి వెళ్లిపోవడంతో సుందర్ పిచాయ్ ఆండ్రాయిడ్ కి ఇంచార్జి అయ్యారు.

అలా గూగుల్ లో సుందర్ పిచాయ్ ర్యాంకింగ్ పెరుగుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి కొన్ని పెద్ద కంపెనీలలో సీఈఓ గా, వైస్ ప్రెసిడెంట్ గా ఉండమని మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ సుందర్ పిచ్చయ్య మాత్రం గూగుల్ ని వదిలి వెళ్ళలేదు. గూగుల్ కూడా సుందర్ పిచాయ్ వదులుకోవాలి అని అనుకోలేదు.

2015 సంవత్సరంలో గూగుల్ ఎవరూ ఊహించని విధంగా సుందర్ పిచాయ్ ని గూగుల్ కంపెనీ సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కసారిగా సుందర్ పిచాయ్ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. మన దేశం నుంచి వెళ్లిన ఒక కుర్రవాడు ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒక దానిని నడిపిస్తున్నాడు.

గూగుల్ సీఈఓ గా సుందర్ పిచాయ్ జీతం:

సీఈఓ గా సుందర్ పిచాయ్ సారథ్యంలో గూగుల్ కంపెనీ ఇప్పుడు దూసుకుపోతుంది. మిగిలిన సీఈఓ లతో పోలిస్తే సుందర్ పిచాయ్ వచ్చిన తర్వాత గూగుల్ కంపెనీ 50 శాతం ఎక్కువగా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఇప్పుడు సుందర్ పిచాయ్ ఒక సంవత్సరం జీతం ఎంత తెలుసా సుమారుగా పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా ఒక రోజుకు మూడున్నర కోట్లు అన్నమాట, అంటే ప్రతి సెకండ్ కు సుమారుగా 400 రూపాయలు అన్నమాట.

సుందర్ పిచాయ్ యొక్క వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ:

ఒక అంతర్జాతీయ సంస్థను నడిపిస్తున్నా కూడా, అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. గూగుల్ లో అందరూ ఉద్యోగులు సుందర్ పిచాయ్ ఎంతగానో ఇష్టపడతారు.

ఒకసారి 7 సంవత్సరాల ఒక పాపకు వాళ్ళ నాన్నగారు గూగుల్ లో జాబ్ చాలా బాగుంటుంది అని చెప్పి, గూగుల్ ఆఫీస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంటర్నెట్లో ఆ పాపకు చూపించాడు. దానితో ఆ పాప పెద్దయ్యాక గూగుల్ లో జాబ్ చేయాలనుకుంటున్నానని వాళ్ళ నాన్నకు చెప్పింది.

అంతేకాకుండా తనకి కంప్యూటర్స్ అంటే ఇష్టమని తనకి గూగుల్లో పని చేయాలని ఉంది అని గూగుల్ కి ఏకంగా ఒక లెటర్ కూడా రాసింది. అయితే దాని గురించి వాళ్ళ పేరెంట్స్ పెద్దగా పట్టించుకోలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఏకంగా గూగుల్ హెడ్ క్వార్టర్స్ నుంచి సుందర్ పిచాయ్ ఆ పాప లెటర్ కి రిప్లై పంపారు.

ఆ పాపని బాగా చదువుకోమని భవిష్యత్తులో తన చదువు పూర్తయ్యాక తన దగ్గర నుంచి వచ్చే జాబ్ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటామని సుందర్ పిచాయ్ ఆ లెటర్లో పేర్కొన్నారు. ఆ లెటర్ చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇంటర్నెట్లో మొత్తం వైరల్ అయిపోయింది.

ఎంతో బిజీగా ఉండే సుందర్ పిచాయ్ ఒక చిన్న పిల్ల లెటర్ కి రెస్పాండ్ అవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంత సింపుల్ గా ఉంటారు ఆయన.

ఇప్పటికీ తాను చదువుకున్న ఐఐటి ఖరగ్‌పూర్లలోని విద్యార్థులతో అప్పుడప్పుడు స్కైప్ ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ లో సుందర్ పిచాయ్ కూడా ఒకరిగా ఉన్నారు.

Sundar Pichai as inspiration to the youngsters

గూగుల్ కంపెనీ సీఈఓ మన వాడే రా అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇంతకు మించిన విజయం ఏముంటుంది మనం ఎక్కడి నుంచి వచ్చాము మన బ్యాక్ గ్రౌండ్ ఏంటి మ్యాటర్ కాదని మనం తలుచుకుంటే ఎంత ఎత్తు కైనా చేరుకోగలమని నిరూపించారు ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలోనే యువతకు ఈయన ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు.

Image Sources: Google

x