మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వార్దా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మెడికల్ స్టూడెంట్స్ మృతిచెందారు.

సవాంగి లోని దత్త మేఘ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు యావత్ మాల్ నుంచి వార్దాకు కారులో వెళుతుండగా రాత్రి ఒకటిన్నర సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. వారు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఆ వెంటనే వంతెనపై నుంచి కింద పడి నుజ్జునుజ్జు అయింది. సుమారు ఆ కారు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడినట్లు తెలుస్తుంది.

ఈ దుర్ఘటనలో కారులోని విద్యార్థులందరూ అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నారు. భండారు జిల్లాల‌కు చెందిన తిరోడా బీజేపీ ఎమ్మెల్యే విజ‌య్ ర‌హంగ్‌డేల్ ఏకైక కుమారుడు ఆవిష్కార్ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారు వివేక్ నందన్, నీరజ్ చౌహన్, నితీశ్ సింగ్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సవాంగి మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

x