ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్ ఫంగస్ కేసులు మరింత ఎక్కువ అవుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో వరుసగా రెండవ బ్లాక్ ఫంగస్ కేసు నమోదవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క అనంతపురం జిల్లా గుంతకల్లు లో నాలుగు కేసులు నమోదయ్యాయి.

తెనాలిలో పరిధిలోని సుల్తానాబాద్ లో ఇటీవల కరోనా నుంచి కోలుకున్న మల్లేశ్వరి అనే మహిళ బ్లాక్ ఫంగస్ భారిన పడగా ఇప్పుడు కొత్తగా రామలింగేశ్వర పేట కు చెందిన మరో మహిళకు ఫంగస్ లక్షణాలు కనిపించాయి. భాగవతుల వారి వీధి కి చెందిన వనజ రాణి అనే 52 ఏళ్ల మహిళ ఈనెల 1న కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉంటూ ప్రైవేట్ వైద్యుల ద్వారా చికిత్స పొందుతుంది.

కరోనా తో చికిత్స పొందుతున్న ఆమె కు కొద్ది రోజులుగా పన్ను నొప్పి తో పాటు ఎడమ కన్ను పూర్తిగా ఉబ్బి పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీన్ని గుర్తించి వెంటనే తెనాలి, గుంటూరు, మంగళగిరి హాస్పిటల్కు ఆమెను తీసుకువెళ్లారు, కానీ ఎక్కడికి వెళ్ళినా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తమ వద్ద లేదని వైద్యులు చెప్పారంటూ బాధితురాలి కుమారుడు రాజేష్ కుమార్ చెప్పాడు. ఇక్కడ చికిత్స అందుబాటులో లేకపోవడంతో ఆమె ను కుటుంబ సభ్యులు మణిపాల్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు.

x