ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా యొక్క బ్లూ వెరిఫై టిక్ మార్కులను ట్విట్టర్ సంస్థ తొలగించండి. అయితే కొద్ది గంటల తర్వాత మళ్లీ ఆయన ఖాతకు బ్లూ టిక్ ను యాడ్ చేసింది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదాలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

గత కొన్ని నెలలుగా వెంకయ్య నాయుడు గారు ట్విట్టర్ ఖాతాను ఉపయోగించకపోవడం వల్లే బ్లూ మార్క్ ను తీసేసినట్లు ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఖాతా నుంచి జులై 23 2020 న చివరి ట్వీట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఎలాంటి ట్వీట్లు చేయలేదు. సాధారణంగా ఒక ఖాతా ఆ వ్యక్తికి చెందిందని అధికారికంగా చెప్పేందుకు ట్విట్టర్ ఈ వెరిఫై బ్లూ మర్క్స్ ను ఇస్తుంది.

అయితే, ట్విట్టర్ నిబంధనల ప్రకారం అకౌంట్ మార్చిన, ఆరు నెలలకు పైగా ఖాతా ను ఉపయోగించక పోయిన, వెరిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎలాంటి నోటీసులు లేకుండానే ఈ బ్లూ టిక్కులను ట్విట్టర్ సంస్థ తొలగిస్తూ ఉంటుంది. అయితే ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు వ్యక్తిగత ఖాతాను ట్విట్టర్ సంస్థ అన్ వెరిఫై చేయడం వివాదాస్పదంగా మారింది.

దీనిపై ఉప రాష్ట్రపతి కార్యాలయం నుంచి అభ్యంతరం వ్యక్తం అవడంతో కొద్ది గంటల తర్వాత తిరిగి ఆయన ఖాతాకు బ్లూ మార్క్స్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియాలో డేటా నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాల అమలు విషయంలో కేంద్రం మరియు ట్విట్టర్ మధ్య వివాదం ఏర్పడింది.

ఆ చట్టాల వల్ల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు ఉందని ట్విట్టర్ చేసిన వ్యాఖ్యలు కేంద్రానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనికి ప్రభుత్వం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో ఉపరాష్ట్రపతి అకౌంట్ కు బ్లూ మార్క్ తొలగించటం మరో వివాదాస్పదంగా మారింది.

x