అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన “పుష్ప ది రైజ్” భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్ లోనే కాదు, అమెజాన్ ప్రైమ్ లో కూడా తన సత్తా ను చాటుతుంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమాకు కొనసాగింపుగా “పుష్ప ది రూల్” ను తెరకెక్కిస్తున్నారు.
పుష్ప పార్ట్ – 1 లో ఉన్న ఐటెం సాంగ్ ఎంత క్లిక్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఈ పాటకు సమంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరియు సమంత గ్లామర్ కు కుర్రకారులు పిచ్చెక్కిపోయారు. ఇదే విధంగా పుష్ప పార్ట్ – 2 లో కూడా మరో ఐటెం సాంగ్ ఉండనుంది. ఈ ఐటెం సాంగ్ మొదటి దానికి మించి ఉండనున్నట్లు సమాచారం.
పుష్ప పార్ట్ – 1 హిందీలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక పుష్ప పార్ట్ 2 ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్ వల్ల నార్త్ లో కూడా మరింత బజ్ వస్తుందనేది దర్శకుడు ఆలోచన. ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.