సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల యూఎస్ నుంచి తిరిగి వచ్చారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇంతలో, తన తదుపరి ప్రాజెక్టు గురించి అనేక ఊహాగానాలు ఏర్పడుతున్నాయి.

అన్నాత్తే సినిమా తర్వాత రజినీకాంత్ కొత్త చిత్రం కోసం దేసింగ్ పెరియస్వామి తో జత కట్టనున్నారు. దేసింగ్ పెరియస్వామి గతంలో దర్శకత్వం వహించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ మరియు రీతూ వర్మ నటించారు. దేసింగ్ పెరియస్వామి, రజినీకాంత్ కలియికలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

గతంలో దీపికా.. రజినీకాంత్ తో కలిసి ‘కొచ్చాడయాన్’ అనే మూవీ చేసింది. అయితే, ఆ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో యానిమేటెడ్ క్యారెక్టర్స్ గా తెరకెక్కింది. కానీ, ఇప్పుడు దీపిక ఈ ప్రాజెక్టుకి సంతకం చేస్తే ఆమెకు రజినీకాంత్ తో ఇది మొదటి రెగ్యులర్ చిత్రం అవుతుంది. ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన అన్నాత్తే సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, నయనతార, కుష్బూ మరియు మీనా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

x