ప్రస్తుతం బాలీవుడ్ సింగర్ ‘యోయో హ‌నీసింగ్’ చిక్కుల్లో పడ్డారు. తన పాటలతో అందరినీ అలరించే హనీ సింగ్ ఒక చీటర్ అంటూ తన భార్య అతనిపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసింది. హనీ సింగ్ తనను చాలా సార్లు కొట్టడమే కాకుండా మాటలతో హింసించే వాడని ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీలోని ‘టిస్ హజారీ కోర్ట్’ సింగర్ కి నోటీసులు జారీ చేసింది.

తన భర్త లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని శాలినీ తల్వార్ కోర్టుకెక్కింది. తన పెళ్లి నాటి నుంచి ఇప్పటి వరకు హనీ సింగ్ మరియు అతని తల్లిదండ్రులు తనను వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించింది. అందుకే హనీ సింగ్ తో పాటు అతని తల్లిదండ్రులు పైన ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. దీంతో తన భర్త మరియు అత్తమామల నుంచి రక్షణ కల్పించాలంటూ ఆమె ఢిల్లీలోని టిస్ హజారీ కోర్ట్ ను ఆశ్రయించింది. ఈ కేసుకు సమాధానం చెప్పాలంటూ న్యాయస్థానం హనీ సింగ్ కు నోటీసులు జారీ చేసింది.

2011లో హనీమూన్ కి వెళ్ళినప్పటి నుంచి ఈ వేధింపులు మొదలైనట్లు ఆమె చెబుతున్నారు. సింగర్ హనీసింగ్ కి, శాలినీ తల్వార్ కి 2001లో పరిచయమైంది. దాదాపు పదేళ్ల డేటింగ్ తరువాత 2011లో వారు పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లయిన కొద్ది రోజులకే హనీసింగ్ ప్రవర్తనలో మార్పు కనిపించినట్లు శాలినీ తల్వార్ చెబుతుంది. ముఖ్యంగా తనకు సింగర్ గా ఫేమ్ వచ్చిన తర్వాత తనను కనీసం మనిషిగా చూడలేదని, అంతేకాదు తనను పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా హనీసింగ్ దాచిపెట్టే ప్రయత్నం చేసినట్లు శాలినీ తల్వార్ కోర్టుకు తెలియచేశారు.

x