బాంబే హైకోర్టు లో ఎంపీ నవనీత్ కౌర్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికేట్ ను రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తప్పుడు పత్రాలతో ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారని శివసేన నాయకుడు ఆనందరావు కోర్టును ఆశ్రయించారు. నకిలీ సర్టిఫికెట్ తో మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారని పిటిషనర్ శివసేన నేత కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

వివరాల్లోకి వెళితే, నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఆమె ఎస్సీ వర్గానికి చెందినదని పేర్కొంది. నవనీత్ కులానికి సంబంధించి, శివసేన నాయకుడు ఆనందరావు బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్నికల సమయంలో నవనీత్ కౌర్ సమర్పించిన పత్రాలను కోర్టు పరిశీలించింది. అన్ని పత్రాలను జాగ్రత్తగా గమనించిన తరువాత, న్యాయస్థానం ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ ను ఫేక్ అని తేల్చి చెప్పింది మరియు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ ను రద్దు చేయడంతో పాటు 2 లక్షల జరిమానా విధించింది. అయితే, బాంబే హైకోర్టు నిర్ణయంతో నవనీత్ తన ఎంపీ పదవిని కోల్పోయే అవకాశం ఉంది.

x