నల్గొండ జిల్లా : ఎంతో మంది అమ్మాయిలు ప్రేమోన్మాదికులకు బలవుతున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో జరిగింది. ఒక ప్రియుడు మద్యం మత్తులో చెలరేగిపోయాడు, పెళ్లికి ఒప్పుకోకపోవడం తో తాను ప్రేమించిన అమ్మాయిని అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన శుక్రవారం నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లో ఒక హోటల్ వద్ద జరిగింది. మద్యం మత్తులో ప్రియురాలు చందనను తన ప్రియుడు శంకర్ బీరు సీసా తో కిరాతకంగా పొడిచి చంపాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతోనే శంకర్ ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. నిందితుడు శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరియు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.