అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లోకి అమీర్ ఖాన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా “లాల్ సింగ్ చద్దా” అనే పేరుతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో నాగచైతన్య ఒక కీలకమైన పాత్ర చేయనున్నారు. మొదట ఈ సినిమాలో విజయ్ సేతుపతిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన స్థానంలో నాగచైతన్య ను తీసుకున్నారు.
రాబోయే కొద్ది వారాల్లో ఈ సినిమా షూటింగ్ ను కశ్మీర్‌లోని కార్గిల్ ప్రాంతంలో ప్రారంభించాల్సి ఉంది. అక్కడ దాదాపు 45రోజుల పాటు యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించటానికి ప్లాన్ చేసారు. ఈ షూటింగ్ లో నాగచైతన్య పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్య పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల షూట్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
అమీర్ ఖాన్‌తో కలిసి షూటింగ్ చేయడానికి నాగచైతన్య చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కానీ, నాగచైతన్య కు వేచి ఉండడం తప్ప మరో మార్గం లేదు. ఈ సినిమా హాలీవుడ్‌లో హిట్ అయినా ‘ఫారెస్ట్ గంప్’ (1994) చిత్రానికి రీమేక్. మరోవైపు నాగచైతన్య నటించిన రెండు సినిమాలు థాంక్యూ మరియు లవ్ స్టోరీ త్వరలో విడుదల కానున్నాయి.