తమిళనాడులో ఒక దారుణం జరిగింది. సొంత అన్న తన చెల్లిని హతమార్చాడు. తన చెల్లి ‘వాట్సాప్’ వాడుతుందని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన తూత్తుకుడి జిల్లా, వాసవంపురం నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుధలై అనే రైతు కు ఒక కుమారుడు మలైరాజా (20), కుమార్తె కవిత (17) ఉన్నారు. ప్రస్తుతం కవిత 12వ తరగతి చదువుతుంది. ఆన్లైన్ చదువుల కోసం అని తన చెల్లి కవితకు సెల్ ఫోన్ కొనిచ్చాడు అన్న మలైరాజా.

ఐతే సెల్ ఫోన్ కొనిచ్చాక చదువు కంటే ఎక్కువగా వాట్సాప్ వీడియోలు చూస్తోంది. దీంతో పలుమార్లు అన్న మలైరాజా తన చెల్లిని హెచ్చరించాడు. అయినా తన చెల్లి కవిత వినలేదు. ప్రతి రోజు ఈ విషయం పై వీరిద్దరి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. దీంతో అన్న మలైరాజా కు కోపం వచ్చి కవిత వీడియో చూస్తున్న సమయంలో వెనక నుంచి కత్తి తో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దాని తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

x