హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఒక కారు బీభత్సం సృష్టించింది. 120 స్పీడుతో వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది, దీంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణం అతిమించిన స్పీడ్ అని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు అష్రాఫ్. అతడు బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది.

ఈ ఘటన లంగర్ హౌస్ పిల్లర్ నెంబర్ హండ్రెడ్ వద్ద జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధిక స్పీడ్ తో దాదాపు 120 పైగా స్పీడ్ తో కారు వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టుకుంటూ చాలా దూరం వెళ్ళింది. ఆ కారు నడిపిన బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు.

కేవలం అతి వేగంగా కారు నడపడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అటువైపు ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటన రాత్రి పూట జరగడంతో అక్కడ పబ్లిక్ లేకపోవడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ కేసులో ఓవర్ స్పీడ్ మాత్రమే ఉంది, ఇందులో మద్యం మత్తు అనేది లేదని పోలీసులు చెబుతున్నారు.

x