ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య 10 వేల మార్క్ ను క్రాస్ చేసింది. నిన్న 7 వేలకు సమీపంలో ఉన్న కేసులు ఒక్క రోజులోనే 3 వేలకు పైగా పెరిగాయి. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10 వేల 57 కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ తెల్పింది.

అందులో ముగ్గురు విశాఖపట్నం కు చెందిన వారు కాగా, మిగిలినవారు శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 44 వేల 935 యాక్టువ్ కేసులు ఉన్నాయి. 1,222 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నరు.

 

x