ఏపీ ప్రభుత్వం కరోనా కేసులు తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని సమయాల్లో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై రోజుకి నాలుగు గంటలు మాత్రమే పని సమయంగా నిర్ణయించారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 17,188 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 73 మంది కరోనా తో మృతి చెందారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 8,519 కి చేరింది. ఒక్కరోజులో 1,00,424 మందికి పరీక్ష నిర్వహించగా అందులో 17 వేల 188 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం 1,86,695 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బయటకు వచ్చేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. రాష్ట్రం లోకి వస్తున్న వాహనాలను చెక్పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు పని చేసే సమయాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కార్యాలయాల్లో ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12:00 తర్వాత ఉండాలంటే ఉద్యోగులు కచ్చితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వం అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చింది.

x