సీఎం జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం జగన్కు నోటీసులు ఇచ్చింది. దీని పైన వివరణ ఇవ్వాలంటూ జగన్ తో పాటు సిబిఐ కి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

వచ్చేనెల 7వ తేదీన సిబిఐ కోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది. ఆర్థిక నేరాలు, అక్రమాస్తులకు సంబంధించిన 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న జగన్కు బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సిబిఐ కోర్టులో తన వాదనలను వినిపించారు. వాదనలను విన్న సిబిఐ కోర్టు పిటిషన్న స్వీకరించింది.

x