దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. దీని కారణంగా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రత లను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల్పింది. దీంతో తెలంగాణలో కూడా ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది.
సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేలా లేదా అనే అంశంపై అధికారులతో ప్రధాని మోదీ ఒక సమీక్ష నిర్వహించారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యభద్రతే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను బలవంతం పెట్టవద్దని ఆయన సూచించారు. ఆబ్జెక్టివ్ క్రైటీరియా(objective criteria) ఆధారంగా విద్యార్థుల ఫలితాలను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.