గుంటూరు జిల్లా గుండ్లపాడు గ్రామంలో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రయ్య గురువారం (జనవరి 13, 2022) ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా ఆయనను నరికి చంపారు. ఆయన హత్యతో పండగ వాతావరణం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.

చంద్రయ్య మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకొని, చంద్రయ్య కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రజాస్వామ్యం కోసం చంద్రయ్య తన జీవితాన్ని త్యాగం చేశారు.

అతను చేసిన త్యాగాన్ని వృధా కానివ్వము. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు మరియు నేరస్తులకు, హంతకులకు అధికారం ఇస్తున్నారు. వైసీపీ హింసాత్మక నాయకుల నుంచి మా నేతలను, పార్టీ కార్యకర్తలను మేము కాపాడుకుంటాము. సీఎం జగన్ తమ మనుషులను నియంత్రించాలి మరియు నేరాలు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి” అని చంద్రబాబు తన ఇంస్టాగ్రామ్ లో భావోద్వేగ పోస్ట్ చేశారు.

మరోవైపు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చింత శివరామయ్య, చింత ఆదినారాయణ, తోట ఆంజనేయులు తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చింత శివరామయ్య ఇంకో హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు.

x